పనులు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పనులు సద్వినియోగం చేసుకోవాలి

Nov 26 2026 11:50 PM | Updated on Nov 26 2026 11:50 PM

రాయికల్‌: రాయికల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో వీబీజీరాంజీ పథకంపై గురువారం రాత్రి వరకు సామాజిక తనిఖీ వేదిక నిర్వహించారు. మండలంలోని 32 గ్రామాల్లో 483 పనులు గుర్తించగా, రూ.4,19,10,979 వేతనాలు మంజూరు చేయగా, సామగ్రి కోసం రూ.27,96,674 వెచ్చించారు. పంచాయతీరాజ్‌ శాఖలో 43 పనులు గుర్తించగా, రూ.11,305 వేతనాలు చెల్లించగా, మెటిరియల్‌ కోసం రూ.1,34,86,631, అటవీశాఖలో 11 పనులు గుర్తించగా రూ.7,62,970 వేతనాలు చెల్లించగా రూ.27,200 సామగ్రికి ఖర్చు చేశారు. మొత్తం రూ.7,90,00,170 అయినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. ఉపాధి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీవో దివ్య, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వేణు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ వీణకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఆర్డీవో రఘువరణ్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వీబీజీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో ఇంకుడుగుంతలు, పూడికతీత పనులు వేగవంతం చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సూచించారు. అడిషనల్‌ డీఆర్డీవో మదన్‌, ఎంపీడీవో చిరంజీవి, డీవీవో వకీల్‌, ఏవీవో దేవేందర్‌రెడ్డి, ఎస్‌ఈసీ నవీన్‌, సోషల్‌ ఆడిటర్లు దత్తు, నరేందర్‌, ఏఈ కల్యాణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement