రైలు మరింత ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

రైలు మరింత ఆలస్యం!

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

రెండున్నరేళ్లు.. రూ.749 కోట్లు.. 32 కిలో మీటర్ల దూరం చురుగ్గా వంతెన పనులు

2029 నాటికి కొత్తపల్లి– మనోహరాబాద్‌ ట్రాక్‌

సిరిసిల్ల వరకు పూర్తయిన పట్టాల పనులు

వేములవాడ నుంచి కొత్తపల్లి వరకు 32 కిలోమీటర్ల ట్రాక్‌కు టెండర్‌

రూ.749 కోట్లతో రెండున్నరేళ్లలో పూర్తి చేసే అవకాశం

వేగంగా సాగుతున్న మానేరు వంతెన పనులు

కొండగట్టులో

అన్నపూర్ణాదేవిగా..

మల్యాల:

మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు.

బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు

ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సోమవారం ధర్మపురిలో బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

రాయికల్‌లో

గాయత్రీ దేవిగా

రాయికల్‌: శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా రాయికల్‌ పట్టణంలో ప్రతిష్ఠించిన అమ్మవారు సోమవారం గాయత్రీదేవిగా.. లక్ష్మీదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమపూజలు చేశారు.

రోళ్లవాగు నీటి సామర్థ్యం పెంచండి

జగిత్యాలరూరల్‌: బీర్‌పూర్‌లోని రోళ్లవాగు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజినీర్‌కు మాజీమంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత లేఖ రాశారు. 0.25 టీఎంసీ సామర్థ్యం నుంచి టీఎంసీకి పెంచాలని నిర్ణయించినా ప్రక్రియ ముందుకు కదలడంలేదన్నారు. నీరు నిల్వ ఉంటే బీర్‌పూర్‌, ధర్మపురి మండలాల రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

14న కిసాన్‌ మేళా

జగిత్యాలఅగ్రికల్చర్‌: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 13న నిర్వహించాల్సిన కిసాన్‌మేళాను 14న చేపడుతున్నట్లు డీఏవో భాస్కర్‌ తెలిపారు. మేళాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులు, దిగుబడి కోసం తీసుకోవాల్సిన చర్యలుపై శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వనున్నట్లు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ ●:

ఉమ్మడి జిల్లావాసులు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి– మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయి. గతేడాదికి పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన దృష్టి సారించకపోవడంతో నిధుల కేటాయింపులో జాప్యం జరిగి ఆలస్యమవుతూ వస్తోంది. హైదరాబాద్‌తో ఉమ్మడి మెదక్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు రైలు సౌకర్యం కల్పించాలన్న సంకల్పంతో 2016లో ప్రధాని మోదీ, నాటి సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైలు నడుస్తుండగా.. సిరిసిల్ల వరకు ట్రాక్‌, స్టేషన్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు పనులు సాగుతున్నాయి.

మనోహరాబాద్‌– కొత్తపల్లి రైల్వేమార్గంలో భాగంగా సిరిసిల్ల నుంచి కొత్తపల్లి మధ్య 32 కిలోమీటర్ల నూతన సింగిల్‌ బ్రాడ్‌గేజ్‌ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ టెండర్‌ జారీ చేసింది. రూ.749 కోట్ల వ్యయంతో ఈ మార్గం పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. అంటే 2029 మార్చి వరకు మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి 151 కిలోమీటర్ల రైల్వే మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు, అప్పుడే కేంద్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ టెండర్‌ సిరిసిల్ల (మినహాయించి) వేములవాడ–కొత్తపల్లి (కలిపి) స్టేషన్ల నిర్మాణం కోసం చేపట్టారు.

సిరిసిల్ల–వేములవాడ మధ్య మిడ్‌ మానేరుపై వంతెన పనులు జరుగుతున్నాయి. 2025 వరకు ప్రాజెక్టు పూర్తవుతుందని అనుకున్నా.. నదిలో దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం అంతసులువుగా అయ్యేలా కనిపించడం లేదు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి నుంచి వేములవాడ మండలం అణుపురం వరకు దాదాపు 2000 మీటర పొడవైన వంతెన పనులు మానేరు నదీ గర్భంలో చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతో పాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్‌ హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్లకు కీలకమైన రూట్‌గా ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ది పేట, జగిత్యాల జిల్లాల ద్వారా పారిశ్రామిక, వ్యవసా య ఉత్పత్తులను హైదరాబాద్‌, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వేలైన్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మానేరువాగుపై కొనసాగుతున్న రైల్వే వంతెన పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement