వైభవంగా దశాబ్ది ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా దశాబ్ది ఉత్సవాలు

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

● జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన పట్టణం ● డ్యాన్స్‌ చేసిన జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు

జగిత్యాల/జగిత్యాలటౌన్‌: జిల్లా ఏర్పడి దశాబ్దం కావడంతో జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఉత్సవాలు చేసుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో జగిత్యాల మార్మోగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు పాతబస్టాండ్‌ నుంచి ప్రదర్శనగా కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, తహసీల్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి, అంగడిబజార్‌లోని కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమకారులను సత్కరించారు. ‘దేక్‌లేంగే..’ పాటకు మాజీమంత్రి జీవన్‌రెడ్డి డ్యాన్స్‌ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వసంత, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి డ్యాన్స్‌తో హోరెత్తించారు. అంగడి బజార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు కలను కేసీఆర్‌ సాకారం చేశారని, పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తే రేవంత్‌రెడ్డి రూపాయి కేటాయించడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి పోవాలన్నారు. కొప్పుల మాట్లాడుతూ పంటలకు నీళ్లు ఇవ్వబోమని చెప్పడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నా రు. కేసీఆర్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ ఇస్తే.. ఇప్పుడు 8 గంటలకు మించడం లేదన్నారు. చల్మెడ లక్ష్మీనర్సింహరావు, రమణారావు పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న జీవన్‌రెడ్డి, పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement