ఆయిల్‌ పాం సాగులో ఎమ్మెల్యే సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పాం సాగులో ఎమ్మెల్యే సంజయ్‌

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

జగిత్యాల అగ్రికల్చర్‌: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఆయిల్‌ పాం సాగుకు ముందుకొచ్చారు. ఆయన స్వగ్రామమైన అంతర్గాంలోని తన 12 ఎకరాల్లో సోమవారం తన సతీమణి ఆధ్వర్యంలో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉద్యాన శాఖ అధికారి కట్ట లత మాట్లాడుతూ.. ఆయిల్‌ పాం సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని, జిల్లాలో 5,447 ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. ఆయిల్‌ పాం గింజలకు మంచి ధర ఉందన్నారు. డీఏవో భాస్కర్‌ మాట్లాడుతూ.. వరికి బదులు ఆయిల్‌ పాం సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రాధిక, లోహియా కంపెనీ జనరల్‌ మేనేజర్‌ మురళి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు నారాయణ రెడ్డి, రవీందర్‌రావు, సర్పంచ్‌ నోముల రమ్య, రైతుబంధు మాజీ అధ్యక్షుడు నక్కల రవీందర్‌ రెడ్డి, హెచ్‌ఈవో అన్వేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement