జనవరి వరకు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జనవరి వరకు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పూర్తి చేయాలి

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

కథలాపూర్‌: మండల కేంద్రంలో కొత్తగా నిర్మి స్తున్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులను జనవరి వరకు పూర్తి చేయాలని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిర్మాణపనులను అధి కారులతో కలిసి సోమవారం పరిశీలించారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన కూలీల సంఖ్య పెంచుకో వాలన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని సూచించారు. ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ డీఈ హనుమయ్య, ఆపరేషన్‌ డీఈలు గంగారాం, సంపత్‌, మధుసూదన్‌, ఏడీఈలు రఘుపతి, భూమేశ్వర్‌, ఏఈ దామోదర్‌ పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌ తనిఖీ

కోరుట్ల: పట్టణ శివారులోని 132/33 కేవీ వి ద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను వరుణ్‌ రెడ్డి తనిఖీ చేశారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా తీరును పరిశీలించారు.

కేసీ కెనాల్‌కు 6వేల క్యూసెక్కుల నీటి విడుదల

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు ఇటీవల రెండు వే ల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన విష యం తెల్సిందే. దానిని సోమవారం 6 వేల క్యూసెక్కులకు పెంచారు. చివరి పొలాలకు నీ రు అందడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. కాలువలకు సరిపడా నీటిని పెంచారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి వివిధ మా ర్గాల ద్వారా 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 43.929 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.

నెట్‌బాల్‌ పోటీల్లో జగిత్యాలకు మూడోస్థానం

ఆసిఫాబాద్‌రూరల్‌: కొమురంభీంఆసిఫాబాద్‌జిల్లా కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ ఆవరణలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల నెట్‌బాల్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో పాల్గొన్న జగిత్యాల జిల్లా మూడోస్థానంలో నిలిచింది. ఆతిథ్య జట్టు కుమురంభీం ఆసిఫాబాద్‌ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో మహబూబ్‌నగర్‌ జట్టు నిలిచింది. విజేత జట్లకు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్యరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement