జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో విద్యుత్ లైట్ల ప్రారంభంలో సర్పంచ్ భర్త ఉపసర్పంచ్‌ను పట్టించుకోలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచులు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో డీఆర్వో ప్రసాద్, ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్ రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో మదన్‌మోహన్ పాల్గొన్నారు.


