● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: విద్యార్థులు క్రీడల్లో రా ణించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ పోటీలను ప్రారంభించారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, దుమాల రాజ్‌కుమార్, ప్రశాంత్‌రావు, రాజ్‌కుమార్, శ్రీను పవన్ పాల్గొన్నారు.
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం రేచపల్లిలో సారంగాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. సర్పంచ్ బాస మహేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సురేందర్, సర్పంచులు మ్యాకల శేఖర్, అరుణశేఖర్, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.
సేవ దృక్పథంతోనే కంటి ఆపరేషన్లు
జగిత్యాల: సేవ దృక్పథంతోనే కంటి ఆపరేషన్లు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక పావని కంటి ఆస్పత్రిలో 12మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేసి అద్దాలు అందజేశారు. డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.


