ధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ధర్మపురిలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ము స్తాబు శారు. ఈనెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయాలను విద్యుద్దీపాలు అలంకరించారు. మొదటి రోజు అమ్మవా రు ఎరుపువర్ణ వస్త్రధారణలో శైలపుత్రిగా, రెండోరో జు పసుపువర్ణ వస్త్ర ధారణలో బ్రహ్మచారిణిగా, మూ డో గులాబీవర్ణ వస్త్రధారణలో చంద్రఘంటా రూపంలో, నాలుగో గోధుమ రంగు వస్త్రధారణలో కూష్మాండ, శాకాంబరిగా, ఐదో రోజు పసుపు వర్ణ వస్త్రధారణలో స్కంధమాతగా, ఆరోరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణలో కాత్యాయినిగా, ఏడో రో జు చిలుకపచ్చ వర్ణ వస్త్రధారణలో కాళరాత్రి రూపంలో, ఎనిమిదో రోజు తెలుపువర్ణ వస్త్రధారణలో మహాగౌరిగా, తొమ్మిదో రోజు ఎరుపురంగు వస్త్రధారణలో సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చివరి రోజు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమివ్వనున్నారు.


