జగిత్యాల: చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు అధైర్యపడొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం కోరినా జిల్లా రైతులు 3,25,060 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని తెలిపారు. ఎస్సారెస్పీలో నీటి నిలువలు తక్కువగా ఉన్నాయని, రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంటలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశామన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, నాగభూషణం, సతీశ్, బండ శంకర్ పాల్గొన్నారు.
లక్ష పోస్ట్‌కార్డు ఉద్యమం అభినందనీయం
ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని రాష్ట్రపతికి లక్ష పోస్ట్‌కార్డులు పంపించడం అభినందనీయమని మంత్రి అన్నారు. పోస్ట్‌కార్డు ఉద్యమానికి సంబంధించిన లేఖలను ప్రదర్శించారు. జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు. బీజేపీ నాయకులు కళ్లు తెరవాలని పేర్కొన్నారు. సేవదళ్ కార్యదర్శి ముకేశ్, అడువాల జ్యోతి, లక్ష్మణ్, నాగభూషణం, రవీందర్‌రావు పాల్గొన్నారు.


