ధర్మపురి: గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. తాగునీరు, భోజన సదుపాయాలు, వసతులు తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూ చించారు. శ్రీఉగ్రనృసింహస్వామి పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. ము న్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


