● జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, వర్షం నీటి కాల్వలు, డ్రైనేజీలు, మురుగు నీటి నిర్వాహణ వంటి వసతుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం యూఐడీఎఫ్ కింద రూ.98.19కోట్లు మంజూరు చేసింది.
● ప్రభుత్వం ఈ నిధులను నేరుగా ఇవ్వకుండా నేషనల్ హౌజింగ్ బ్యాంకు ద్వారా రుణ సహాయం చేస్తోంది.
● రుణాన్ని ఆయా మున్సిపాలిటీలు ఏడేళ్లలోపు రెండేళ్ల మారటోరియం కాలంతో సహా ఐదు వార్షిక వాయిదాలతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
● ప్రస్తుతం మూడు మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినా వసతుల కల్పనకు రుణాన్ని తీసుకోవడానికి అంగీకారం తెలిపాయి.
● మూడు పట్టణాల్లో ఈ నిధులతో చేపట్టే పనులకు గత జనవరి నెలలో అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటివరకు నేషనల్ బ్యాంకు నుంచి మున్సిపాలిటీలకు రుణం మంజూరు కాలేదు.
● టెండర్ల సమయంలో కొన్ని పనులకు కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేయలేదు. వీటికి పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు.
● మరోవైపు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటిని మొదలు పెట్టడానికి తర్జనభర్జన పడుతున్నారు.
● మెట్‌పల్లిలో మొత్తం 11 పనులు ఉంటే ఇప్పటివరకు ఒక్కచోట డ్రైనేజీ మాత్రమే పూర్తికావడం గమనార్హం.
● జగిత్యాల, కోరుట్లలో టెండర్లు పూర్తయినా పనులు ఇంకా మొదలుపెట్టనట్లు తెలిసింది.
● టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు చేయకుండా జాప్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు మెట్‌పల్లిలో అధికారులు నోటీసులు జారీ చేశారు.
● పనులు వెంటనే ప్రారంభించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.
● అధికారుల తీరును కాంట్రాక్టర్లు తప్పుబడుతున్నారు. పనులు చేసిన తర్వాత రుణం మంజూరు కాకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
● ఇప్పటికే గతంలో చేసిన పలు పనుల బిల్లులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకునే తాము యూఐడీఎఫ్ పనుల విషయంలో తొందరపడడం లేదని చెబుతున్నారు.
బ్యాంకు రుణం మంజూరు కాకముందే టెండర్లు పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్టర్ల తర్జనభర్జన జాప్యంపై అధికారుల నోటీసులు
మెట్‌పల్లి: జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో యూఐడీఎఫ్ (అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్) నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఈ నిధులను నేషనల్ హౌజింగ్ బ్యాంకు ద్వారా రుణం రూపంలో అందజేస్తోంది. రుణం మంజూరు కాకపోయినప్పటికీ అధికారులు పనులను గుర్తించి వాటికి టెండర్లు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తి చేసి నెలలు గడుస్తున్నారు ణం విషయంలో స్పష్టత లేకపోవడంతో పనులు చేపట్టే విషయంలో కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు.
మూడింటికి రూ.98.19కోట్ల నిధులు..
మంజూరులో తీవ్ర జాప్యం..
కాంట్రాక్టర్లకు నోటీసులపై విమర్శలు..
అవసరమైన
డాక్యుమెంట్లు అందించాం
కొన్ని డాక్యుమెంట్లు లేక రుణం మంజూరులో జాప్యం జరుగుతోంది. ఇటీవల ఆ డాక్యుమెంట్లను అందించాం. తొందరలోనే మంజూరు అవుతాయని భావిస్తున్నాం. పనులు చేపట్టని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చాం.
– నాగేశ్వర్‌రావు, డీఈఈ, మెట్‌పల్లి
ఈ చిత్రం మెట్‌పల్లి మున్సిపాలిటీలోని 12వార్డులో నిర్మించిన డ్రైనేజీ. దీనిని
యూఐడీఎఫ్ నిధులతో రెండు నెలల క్రితం నిర్మించారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు బిల్లుల చెల్లించలేదు. ఈ కారణంతో దీనికింద చేపట్టే మిగతా పనులను కాంట్రాక్టర్లు మొదలుపెట్టడం లేదు. ఇది ఒక్క మెట్‌పల్లిలోనే కాదు.. జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీల్లోను ఇదే పరిస్థితి నెలకొంది.
మున్సిపాలిటీ మంజూరు(కోట్లల్లో)
జగిత్యాల రూ.62.05
కోరుట్ల రూ.18.07
మెట్‌పల్లి రూ.18.07
మొత్తం రూ.98.19