‘ఎస్‌ఐఆర్‌’ నోటీసుల్లో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ నోటీసుల్లో నిర్లక్ష్యం వద్దు

Oct 4 2026 8:26 AM | Updated on Oct 4 2026 8:26 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మెట్‌పల్లి: ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీలో బీఎల్‌వోలు నిర్లక్ష్యం చూపొద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం సమీక్షించారు. అధికారులు, బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. సకాలంలో నోటీసులు ఇవ్వడంతోపాటు వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఆర్డీవోలు నర్సింహారావు, జివాకర్‌రెడ్డి తదితరులున్నారు.

డైనింగ్‌హాల్‌ పూర్తి చేయాలి

ఇబ్రహీంపట్నం: పాఠశాలలో డైనింగ్‌హాల్‌, వాష్‌ రూం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలకేంద్రంలోని బీసీ బాలు ర హాస్టల్‌లో రూ.20.52 లక్షలతో నిర్మిస్తున్న డైనింగ్‌ హాల్‌, వాష్‌రూం పనులను పరిశీలించారు. వి ద్యార్థుల హాజరు... వారికి టిఫిన్లు, భోజనాలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. తహసీల్దార్‌ వరప్రసాద్‌తో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవో గణేశ్‌, ఎంపీవో రామకృష్ణరాజు, పీఆర్‌ఈఈ లక్ష్మణ్‌రావు, సర్పంచు బద్దం గోపి, ఏపీఎం శంకర్‌, ఆర్‌ఐ రేవంత్‌రెడ్డి, హాస్టల్‌ వార్డెన్లు పెద్దులు, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉచిత ప్రిలిమినరీ రెసిడెన్షియల్‌ కోచింగ్‌

జగిత్యాల: పోలీస్‌ ఉద్యోగాల నియామకానికి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు మూడు నెలలపాటు ఉచిత ప్రిమిలినరీ పరీక్ష, రెసిడెన్షియల్‌ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. స్టడీ సర్కిల్‌ రిజర్వేషన్‌, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని, తులసీనగర్‌లోని హునరరీ డైరెక్టర్‌ టీజీఎీస్సీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 7చివరి తేదీ అని, మిగతా వివరాలకు 63035 54770 సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement