మట్టి నుంచి మ్యాట్‌పైకి.. | - | Sakshi
Sakshi News home page

మట్టి నుంచి మ్యాట్‌పైకి..

Oct 4 2026 8:26 AM | Updated on Oct 4 2026 8:26 AM

మట్టి నుంచి మ్యాట్‌పైకి..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎం.దిలీప్‌, యు.బాలకృష్ణ, ఎస్‌.కీర్తన కబడ్డీ క్రీడాకారులు. వీరు ఇప్పటి వరకు ఒక నేషనల్‌, పది స్టేట్‌మీట్స్‌లో పాల్గొన్నారు. కబడ్డీ అంటేనే గాయాలు అవుతుంటాయి. అయితే వేములవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న వీరు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జట్టుల్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్ప టి వరకు మట్టి మైదానంలో ఆడామని.. తొలి సారి మ్యాట్‌పై ఆడడం బాగుందంటున్నారు. మంచి గ్రిప్‌, స్పీడ్‌గా స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు. జాతీయస్థాయిలో ఆడడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. దిలీప్‌, బాలకృష్ణ డిగ్రీ ఫస్టియర్‌ చదువుతుండగా, ఎస్‌.కీర్తన ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement