ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

వెల్గటూర్‌: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. పురాతన ఆలయ గోపురాలను జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ. 4.50కోట్లు, రాజగోపురానికి రూ.కోటి మంజూరు చేసింది. పుష్కరాల వరకు పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆలయ కమి టీ చైర్మన్‌ పూదరి రమేశ్‌ తెలిపారు. ఈవో కాంతారెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు ఽపాల్గొన్నారు.

జేఎన్టీయూలో ఇంజినీరింగ్‌ డే

కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి) ఇంజినీరింగ్‌ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్‌ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ప్రిన్సిపల్‌ నరసింహ మాట్లాడుతూ దేశం సాంకేతికత పురోగతిలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. నిజాంకాలంలో నిర్మించిన డ్యాముల నిర్వహణలో ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను విద్యార్థులకు వివరించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య మానవ ప్రమేయం లే కుండా నీటి ఒత్తిడి ఆధారంగా ఆటోమేటిక్‌గా తెరచుకునే డ్యామ్‌ గేట్లకు ఆనాడే రూపకల్పన చేశారని కొనియాడారు. వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

నవరాత్రి ఉత్సవాలు

ప్రశాంతంగా జరుపుకోవాలి

జగిత్యాలక్రైం: ప్రజలకు ఎస్పీ అశోక్‌కుమార్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. గణేశ్‌ మండపా ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు శాఖకు సహకరించా లని కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు భద్రత, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ తరుఫున ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

విదేశీ ఉద్యోగాలకు

ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌

జగిత్యాల: టామ్‌కామ్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న ఎన్‌రోల్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ తెలి పారు. జర్మనీ, మలేషియా, ఖతర్‌, ఇజ్రాయిల్‌, ఆస్ట్రియా, ఐర్లాండ్‌, సౌదీ, మర్సిస్‌, యునైటెడ్‌ ఎమిరెడ్స్‌ దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు అర్హులు డ్రైవ్‌ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాల కోసం టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

నిధులు మంజూరు చేయండి

కోరుట్ల: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విన్నవించారు. హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రోడ్లు, వంతెనలకు రూ.78కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని జువ్వాడి పేర్కొన్నారు.

ఒడ్డెలింగాపూర్‌ ఆస్పత్రి తనిఖీ

రాయికల్‌: మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జేసీబీ సహాయంతో పిచ్చిమొక్కలు తొలగించారు. ఆయన వెంట మెడికల్‌ ఆఫీసర్‌ సతీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement