జగిత్యాల: బల్దియాలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చాంద్‌ఖాన్ గుండెపోటుతో మృతిచెందాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన చాంద్‌ఖాన్ ఆటో తీసుకుని 47వ వార్డులో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాడు. తన వెంట ఉన్న కార్మికుడు రాజయ్యతో అస్వస్థతగా ఉందని, కూర్చుంటానని చెప్పి ఆటోలోకి వెళ్లాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. విషయాన్ని రాజన్న ఆయన కుటుంబ సభ్యులకు తెలపగా.. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
పాలకేంద్రాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పాలకేంద్రాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలల్లో కల్తీ జరుగుతోందనే ఫిర్యాదు మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారి అనూష ఆధ్వర్యంలో సోదాలు చేశారు. వెన్నశాతం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోందని, పూర్తిస్థాయిలో శాంపిల్స్ సేకరిస్తున్నామని, అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.


