డాక్యుమెంట్ రైటర్ల బరి తెగింపు వివాదాస్పద భూమి రిజిస్ట్రేషన్‌కు నకిలీ సర్టిఫికెట్ తయారు తహసీల్దార్ ఫిర్యాదుతో అక్రమ వ్యవహారం వెలుగులోకి ఓ రైటర్‌తోపాటు మరో ముగ్గురు అరెస్ట్
మెట్‌పల్లి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లు బరి తెగిస్తున్నారు. డబ్బుల కోసం నకిలీ పత్రాలు సృష్టిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా అవినీతి జరుగుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనిని నియంత్రించడానికి డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్, స్లాట్ బుకింగ్ వంటి విధానాలను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల ప్రజలు రైటర్లతో నిమిత్తం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. కానీ ఆన్‌లైన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధిక సంపాదన కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్‌పల్లిలో బయటపడిన రాకేశ్ అనే డాక్యుమెంట్ రైటర్ వ్యవహారమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
అక్రమాలు అనేకం..
ఆ ఉద్యోగి పాత్రపై పోలీసుల ఆరా
నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం
ఎనిమిది గుంటల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. అలాగే డాక్యుమెంట్ రైటర్ రాకేశ్ ఏర్పాటు చేసుకున్న షెడ్డు మా కార్యాలయం పరిధిలో లేదు. అతడు ఇతరుల ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాని విషయంలో మేం జోక్యం చేసుకోలేం.
– వెంకటేశ్, సబ్ రిజిస్ట్రార్, మెట్‌పల్లి
ఇది మెట్‌పల్లి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. కార్యాలయంలోకి ప్రవేశించే చోట కుడి వైపు కనిపిస్తున్నది పాకాల రాకేశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఏర్పాటు చేసుకున్న షెడ్డు. ఇక్కడ కొంతకాలంగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాడు. స్థానిక తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు నకిలీప్రతాలు సృష్టించి.. తద్వారా ఓ భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పోలీసులు రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన నలుగురిలో ఈ రాకేశ్ ఒకడు. నిబంధనల ప్రకారం.. రైటర్లను కార్యాలయంలోకి అనుమతించకూడదు. కానీ రాకేశ్ ఏకంగా కార్యాలయం ఆవరణలోనే దర్జాగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అఽధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.


