మూత‘బడి’ని బతికించారు | - | Sakshi
Sakshi News home page

మూత‘బడి’ని బతికించారు

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

పునర్జీవం పోసిన గ్రామస్తులు వెంకట్రావుపేటలో 22మందితో.. రాజరాంపల్లితండా పాఠశాలలు పునఃప్రారంభం

మల్లాపూర్‌: కలిసికట్టుగా నడిచారు. మూతబడిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి పునర్జీవం పోశారు. మండలంలోని వెంకట్రావ్‌పేట ప్రాథమిక పాఠశాలను మూడేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేశారు. సర్పంచ్‌ వెంకటేశ్‌, పంచాయతీ పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై బడి పునఃప్రారంభ ఆవశ్యకతను వివరించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై రప్పించారు. బడిబాటలో 22మందిని చేర్పించారు. మంగళవారం ఎంఈవో కేతిరి దామోదర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంతడపుల పుష్పలతతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు.

రాజరాంపల్లితండా పాఠశాల..

పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని రాజరాంపల్లితండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేని కారణంగా నాలుగేళ్ల క్రితం మూతబడింది. సర్పంచ్‌ ఇస్లావత్‌ రమేశ్‌ నాయక్‌ చొరవ చూపి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఉపాధ్యాయులను రప్పించారు. కొందరు విద్యార్థులు పాఠశాలలో చేరగా ఆ పాఠశాలను మంగళవారం అధికారులు ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పెన్నులు అందించారు. ఏఎంసీ చైర్మన్‌ రాములుగౌడ్‌, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌, తహసీల్దార్‌ నిజామొద్దీన్‌, ఎంఈవో సులోచన, ఆర్‌ఐ జమున, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement