మా గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం 18 మందితో కలిసి కమిటీని ఎన్నుకున్నాం. వీరందరి సహకారంతో గ్రామంలో 1250 ప్లేట్లు, 600 గ్లాసులు సమకూర్చుకున్నాం. ఎక్కడ శుభకార్యం జరిగినా ఉచితంగా వాటిని అందజేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నాం.
– సామల్ల వేణు, ఇటిక్యాల
కూలీలు విస్తార్లు కుడుతున్నారు
ఉపాధి కూలీలు పనులు ముగిసిన అనంతరం విస్తరాకులు కుట్టి.. అందులోనే భోజనం చేస్తున్నాం. మిగిలిన వాటిని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఉపాధి డబ్బులతోపాటు, విస్తరాకులు కుట్టడం ద్వారా కూడా ఉపాధి కూలీలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
– మెక్కొండ రాంరెడ్డి, ఆలూరు
స్టీల్ ప్లేట్లు వినియోగించాలి
ఇటిక్యాల, ఆలూరు గ్రామాలతోపాటు అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణపై సమరశంఖం పూరించాలి. స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగించడం వల్ల కొంతమేరకు క్యాన్సర్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చు. యువత, మహిళలు ముందుకు రావాల్సిన అవసరముంది.
– చిరంజీవి, ఎంపీడీవో


