కుల సంఘాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

కుల సంఘాల అభివృద్ధికి కృషి

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

కథలాపూర్‌: కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని బొమ్మెన, గంభీర్‌పూర్‌, దూలూర్‌, తాండ్య్రాలలో బుధవారం పర్యటించారు. కులసంఘాల భవనాలు, అభివృద్ధి పనులకు రూ.1.40కోట్ల ప్రొసీడింగ్‌ కాపీలు అందించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు చెదలు సత్యనారాయణ, పిడుగు తిరుపతిరెడ్డి, పంజాల సత్యనారాయణ, భూపెల్లి రాజగంగారాం, ఉరుమల్ల కృష్ణాచారి, గోపిడి ధనుంజయ్‌రెడ్డి, లింగంగౌడ్‌, పానుగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

సైక్లింగ్‌తో ఆరోగ్యం

మల్యాల: సైక్లింగ్‌తో శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి పాలనలో భాగంగా బుధవారం మండలంలోని కొండగట్టు అర్బన్‌ ఫారెస్టు పార్క్‌లో అటవీశాఖ అధికారులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడేశారు. డీఎఫ్‌ఓ మాట్లాడుతూ సైకిల్‌ పోటీలతో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ గులామోద్దీన్‌, డీఆర్‌వో శ్రీనివాస్‌, బి.దేవదాస్‌, ఎం.సుబ్బారావు, శ్రీకాంత్‌, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్స్‌ ప్రవీణ్‌కుమార్‌, అశ్విని, ఎండీ.ఫిరోజ్‌, జి.రాజేశం పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

మల్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో రాము అన్నారు. మండలంలోని రాజారం గ్రామంలో విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నామని, అనుభవం, అర్హత గల ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం విజయ్‌, ఎంఈవో నీలగిరి జయసింహారావు, ఉప సర్పంచ్‌ కె.శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు అశోక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజలు

మల్యాల: రాష్ట్ర యాదవ సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ రఘునాథ్‌ యాదవ్‌ బుధవారం కొండగ ట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి తీర్థ, ప్రసాదాలు అందించారు.

నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ

జగిత్యాల: ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం కొత్తబస్టాండ్‌లోని కార్మికుల అడ్డా వద్ద క్షయవ్యాధి నిర్ధారణ, రక్త పరీక్షలు నిర్వహించారు. రాత్రి సమయంలో జ్వరం, తదితర లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్లు శ్రీనివాస్‌, ఎస్టీఎస్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ రవీందర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శరత్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ అనూష తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement