కళాశాల అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కళాశాల అందుబాటులో ఉండాలి

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య పెంచాలి. మండలంలో ఎనిమిది గ్రామాలు.. భీమారం మండలంలోని నాలుగు గ్రామాలకు తాండ్య్రాల చౌరస్తా కూడలిగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు రవాణాపరంగా సౌకర్యంగా ఉంటుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపాలి.

– మామిడిపెల్లి ప్రవీణ్‌,

యువకుడు, తాండ్య్రాల

ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి

మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బాలికలు ఇంటర్‌, డిగ్రీ చదువును మధ్యలోనే మానేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. గ్రామాల నుంచి విద్యాసంస్థల వరకు ప్రత్యేక వాహనాల సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలి. అప్పుడే గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతుంది.

– అందె రాణి, వార్డుసభ్యురాలు, చింతకుంట

Advertisement
 
Advertisement
Advertisement