రాయికల్: బాసర ట్రిపుల్ ఐటీలో సీ టు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు న్యాతగిరి సంజన, రాజ్‌దీపక్‌కు దుబా య్ లోని ఎమ్రెడ్స్ తెలంగాణ సంఘం ఫౌండర్ పీచర్ల కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రూ.50 వేలు సమకూర్చారు. నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని ఈ నెల ఒకటిన సరస్వతి పుత్రులకు లేని లక్ష్మీకటాక్షం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఈటీసీఏ అధ్యక్షుడు చీటి జగదీశ్వర్‌రావు, కో–ఆర్డినేటర్ పునుగోటి సురేందర్‌రావు స్పందించారు. బుధవారం గ్రామస్తుల సమక్షంలో రూ.50 వేలు అందించారు. విద్యార్థులకు ఇప్పటివరకు రూ.1.30 లక్షలు సమకూరాయి. సర్పంచ్ గుర్రం భావన, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, నా యకులు అన్నవేని వేణు, జక్కుల ప్రసాద్, మహేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, గంగాధర్, ప్రసా ద్, లక్ష్మీనారాయణ, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.


