● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్
మెట్‌పల్లి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని, తద్వారా క్వింటాల్‌కు రూ.700 నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసి విషయాన్ని వివరించినా.. పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.


