జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జిలు యార రేణుక, పుల్లా కార్తీక్‌ను జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు బుధవారం కలిశారు. జిల్లా కోర్టు సముదాయంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, అడిషనల్ మున్సిపల్ కోర్టుల ఏర్పాటుతోపాటు సరిపడా సిబ్బందిని భర్తీ చేయాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, మాజీ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, మారిశెట్టి ప్రతాప్ పాల్గొన్నారు.
కొండగట్టులో మండలిలో ప్రతిపక్ష నేత పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈవో అంజనారెడ్డి స్వామివారి శేషవస్త్రం కప్పి సన్మానించారు. తహసీల్దార్ వసంతం, ఏఈవో హరిహరనాథ్, ఆర్‌ఐ తిరుపతి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
క్షయ నివారణకు కృషి చేద్దాం
రాయికల్: క్షయవ్యాధి నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాట్లవాయి గ్రామంలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్‌రే మిషన్‌తో క్షయ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే తెమడ పరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సతీశ్‌కుమార్, ఉపసర్పంచ్ నారాయణ, సూపర్‌వైజర్లు శ్రీనివాస్, ఇల్లెందుల శ్రీనివాస్, ఎంఎల్‌హెచ్‌పీ పద్మావతి, హెల్త్ అసిస్టెంట్లు భూమయ్య, లక్ష్మీనారాయణ, రేడియోగ్రాఫర్ వికాస్, ఏఎన్‌ఎం లలిత పాల్గొన్నారు.
ఆర్టిజన్ కార్మికుల సమ్మె
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు సంస్థ ఆర్టిజన్ కార్మికులు బుధవారం సమ్మె చేశారు. రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ఆదేశాల మేరకు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం మారినా తమ బతుకులు మారడం లేదని అన్నారు. ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలని కోరారు. సంస్థలో ఇప్పటికీ బ్రిటిష్‌కాలంనాటి విధానాలే కొనసాగుతున్నాయని ఆరోపించారు.


