కోఆప్షన్‌పై ప్రధాన పార్టీల కన్ను | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌పై ప్రధాన పార్టీల కన్ను

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

● ఏ పార్టీకీ లేని పూర్తిస్థాయి మెజార్టీ ● పొత్తుల కోసం ప్రయత్నాలు ముమ్మరం ● చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పెద్దలు వ్యవహరించిన తీరుపై ఆ రెండు పార్టీల కౌన్సిలర్లు ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ● పలు మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు కలిసి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను దక్కించుకున్నాయి. తాజాగా ఖానాపూర్‌, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. కానీ మెట్‌పల్లిలో రెండు పార్టీల పెద్దలు పొత్తుకు అంగీకరించకపోవడంతో మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. ● ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన నలుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్‌ ఆర్థికంగా బాగా లబ్ధి పొందారనే ప్రచారం ఉంది. ● అదే సమయంలో పార్టీ పెద్దల వల్ల తమకు పదవులు, పైసలు దక్కకుండా పోయాయని బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లలో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ● ప్రస్తుతం కో–ఆప్షన్‌ పదవుల విషయంలో పెద్దల సూచనలతో నిమిత్తం లేకుండా నడుచుకోవాలనే ఆలోచనలో ఇరు పార్టీల కౌన్సిలర్లు ఉన్నట్లు తెలిసింది. ● మున్సిపల్‌లో నాలుగు కోఆప్షన్‌ పదవులు ఉండగా.. వీటన్నింటిని కై వసం చేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ● బీజేపీ, బీఆర్‌ఎస్‌ బరిలో ఉండాలని యోచిస్తుండడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ఆ రెండు పార్టీలు అభ్యర్థులను నిలిపితే పోటీ తీవ్రంగా ఉండే అవకాాశముంది. ● నాలుగింటిలో తమకు రెండు పదవులు ఇస్తే మ రో పార్టీకి మద్దతు ఇస్తామని బీజేపీ ముఖ్య నా యకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ● మొత్తానికి మూడు పార్టీలు ఈ పదవులపై కన్నేయడంతో అవి ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తిగా మారింది.

మెట్‌పల్లి: మున్సిపల్‌లో కో–ఆప్షన్‌ సభ్యుల పదవి దక్కించుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ పదవులకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది రోజులే గడువు ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26మంది కౌన్సిలర్‌ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ పది, కాంగ్రెస్‌ ఆరు బీఆర్‌ఎస్‌ ఆరు, స్వతంత్రులు నాలుగు స్థానా ల్లో గెలుపొందారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఏ పార్టీకీ పూర్తిస్థాయిలో మెజార్టీ రానప్పటి కీ అధికార కాంగ్రెస్‌ స్వతంత్రులు, ఒక బీజేపీ కౌ న్సిలర్‌ మద్దతుతో ఆ రెండు పదవులను ‘చే’జి క్కుంచుకుంది. కోఆప్షన్‌ పదవులను కూడా పూర్తిగా ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా ఆ పదవులను దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నాయి.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లలో తీవ్ర అసంతృప్తి..

పదవులు నాలుగు..పోటీ తీవ్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement