విద్యుత్‌స్తంభాలను తొలగిస్తాం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌స్తంభాలను తొలగిస్తాం

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

మల్లాపూర్‌: మండలకేంద్రం శివారులోని ముష్కరి గంగమణి వ్యవసాయ భూమిని ప్రజాప్రతినిధులు, ట్రాన్స్‌కో అధికారులు సోమవారం సందర్శించారు. బాధితురాలికి చెందిన 20 గుంటల భూమిలో 8 విద్యుత్‌ స్తంభాలు వేయడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘కాల్మొక్తా సారూ.. కనికరించండి’ శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనికి విద్యుత్‌శాఖ అధికారులు స్పందించారు. స్తంభాలను పరిశీలించి వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఏఈ వినీత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధితురాలి భూమిని పరిశీలించామని, స్తంభాలను తొలగించడంతోపాటు వాటి ని సర్దుబాటు చేసేలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని వివరించారు. ట్రాన్స్‌కో సబ్‌ ఇంజినీర్‌ మహమ్మద్‌ ఆలీ, సర్పంచ్‌ చిట్యాల లక్ష్మణ్‌, ఉపసర్పంచ్‌ గడ్డం సోమరెడ్డి, ట్రాన్స్‌కో లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మణ్‌, లైన్‌మెన్లు, ఏఎల్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement