హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలి

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

మెట్‌పల్లిరూరల్‌: హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ)టీకాలు బాలికలు తప్పనిసరిగా వేయించుకోవాలని మెట్‌పల్లి మండల వైద్యాధికారి ఎలాల అంజిత్‌రెడ్డి అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వారా (సర్వైకల్‌) క్యాన్సర్‌ నివారణలో ఈ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 14, 15 ఏళ్ల వయస్సున్న బాలికలకు టీకాలు వేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైద్యులు నరేందర్‌, శివానీ, కార్యదర్శి ప్రశాంత్‌, ఉపసర్పంచ్‌ లక్మ చిన్నయ్య పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 11 దరఖాస్తులు

జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

క్రీడలతో మానసికోల్లాసం

రాయికల్‌: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని మాజీమంత్రి జీవన్‌ రెడ్డి అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ధ్రువ బాక్స్‌ క్రికెట్‌, ఇండోర్‌ షటిల్‌ కోర్టును సోమవారం బ్యాటింగ్‌ చేసి ప్రారంభించారు. యువత చెడు అలవాట్ల వైపు వెళ్లవద్దని, మొబైల్‌ ఫోన్లకు అలవాటు పడొద్దని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవీందర్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ దావ వసంత, నిర్వాహకులు అనుమండ్ల జీవన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తురగ సౌజన్య, కౌన్సిలర్లు రాకేశ్‌, ఆలయ చైర్మన్‌ దాసరి గంగాధర్‌, నాయకులు గోపి రాజారెడ్డి, మ్యాకల రమేశ్‌, తురగ శ్రీధర్‌, మచ్చ శేఖర్‌, ఎలిగేటి అనిల్‌, బాపురపు నరసయ్య, బత్తిని భూమయ్య, కట్కం కల్యాణ్‌, మున్ను, భూమేష్‌, కడకుంట్ల నరేష్‌, నాగరాజు, నవీన్‌, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement