కరీంనగర్: ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటవెంటనే పరిష్కరిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన 32మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, రూ.25.40లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామన్నారు. ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలు అందించారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో నరేష్ కుమార్, ఎంపీవో కృపాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.


