మిలర్ల దోపిడీపై అన్నదాతల ఆగ్రహం
కొడిమ్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిలర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆదివారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని పూడూరు వద్ద కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వీరికి బీజేపీ మండల నాయకులు మద్దతు తెలిపారు. రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కిరణ్ ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు డ్రంకెన్‌డ్రైవ్
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకే పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పది నెలల్లో మద్యం సేవించి వాహనం నడిపిన 8,686 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే ప్రమాదాలకు కారణమైన వారిపై 304–2 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో ఎక్కువసార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.
కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో
మేడిపల్లి: మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను డీఈవో ఆదివారం తనిఖీ చేశారు. రానున్న పరీక్షలకు అన్ని విధాలా సిద్ధం కావాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. పట్టుదలతో చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుకున్నారు.
మిలర్ల దోపిడీపై అన్నదాతల ఆగ్రహం
మిలర్ల దోపిడీపై అన్నదాతల ఆగ్రహం


