వృద్ధురాలి ఇంట్లో నుంచి ఆభరణాలు చోరీ
మల్యాల: ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని మద్దుట్లలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మీనుగు లస్మవ్వ (80)కు ముగ్గురు కూతుళ్లు. అందరికీ వివాహమైంది. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం రాత్రి లస్మవ్వ తన ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరవడి సుమారు తులం బంగారం విలువైన చెవుల కమ్మలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


