పురుగుల మందు డబ్బాలతో ఆందోళన
● ప్రజావాణిలో అననదాతల ఆందోళన
కరీంనగర్ అర్బన్: సర్వేచేసి హద్దులు చూపాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాతో ఆందోళన వ్యక్తంచేశారు. అప్రమత్తమైన పోలీసులు డబ్బాలను స్వాధీనం చేసుకోగా ఉద్రిక్తతకు తెరపడింది. వివరాల్లోకి వెళితే..గన్నేరువరం మండలం గోపాల్‌పూర్‌లోని 178 సర్వేనంబర్‌లో వ్యవసాయ భూమి హద్దులు చూపాలని సర్వే ల్యాండ్ ఏడీకి దరఖాస్తు చేశామని కొంపల్లి రాములు, నరేశ్, తిరుపతి, శేఖర్, శ్రీకాంత్ తెలిపారు. మోకాపై సర్వే చేసిన అధికారులు హద్దులు నిర్ణయించలేదని, పంచనామా రిపోర్ట్ ఇవ్వడం లేదని వాపోయారు. హద్దులు తేలుస్తారా.. చావమంటారా అంటూ పురుగు మందు డబ్బాలతో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై అధికారులను వివరణ కోరగా ఓవర్ ల్యాప్ అయిందని, మోకాపై భూమి లేదని రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు వివరించారు.


