వాచ్‌మన్ అనుమానాస్పద మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బీ కాలనీ ఎన్టీపీసీ పంపుహౌస్‌లో వాచ్‌మన్ కాట శ్రీనివాస్‌గౌడ్(58) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. స్థానిక ఇందిరానగర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్‌గౌడ్ శ్రీరామ సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో కాంట్రాక్టు వాచ్‌మన్‌గా పంపుహౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మొదటి షిఫ్ట్‌కు వెళ్లిన అతడు.. రెండోషిఫ్ట్ కూడా డ్యూటీ చేందుకు మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతడి భార్య రాజేశ్వరి టీ తీసుకొని వెళ్లి భర్తకు అందజేసి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటలకు తన భర్తకు ఫోన్‌చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో కూతురుతో కలిసి పంపుహౌస్ వద్దకు వెళ్లింది. అప్పటికే మూడోషిఫ్ట్‌లో చేరేందుకు వచ్చిన రాజయ్య పంపుహౌస్ వద్దకు చేరుకున్నాడు. భర్త గురించి రాజయ్యను ప్రశ్నించి అందరూ కలిసి వెతికినా ఆచూకీ లభించలేదు. పంపుహౌస్ వెనకాలకు వెళ్లి చూడగా కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం నుదుటిపై బలమైన గాయాలను గుర్తించారు. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, కారణాలపై దర్యాప్తు చేపట్టామని సీఐ పేర్కొన్నారు.
పంపుహౌస్ వద్ద ఘటన


