మద్యంషాపుల కేటాయింపు
జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారిని పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో నిర్వాహకులను ఎంపిక చేశారు. డ్రా సందర్బంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. 71 మద్యం దుకాణాలకు 1966 దరఖాస్తులు వచ్చాయని, ఎస్సీ సామాజిక వర్గానికి 8, గౌడ వర్గానికి 14, ఓపెన్ కేటగిరీలో 49 దుకాణాలు కేటాయించామని పేర్కొన్నారు. షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిర్వహించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


