బిల్లు రాక ఇల్లు ఆగింది
మాది గోపాల్‌రావుపేట. అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్‌మెంట్ వరకు పూర్తయ్యింది. పనులు పరిశీలించిన అధికారులు గతనెల 6న ఫొటో కూడా తీసుకున్నారు. 40రోజులైనా డబ్బులు ఖాతాలో జమకాలేదు. అధికారులను అడిగితే ఇల్లు ఎల్–3లో ఉందని అంటున్నారు. బిల్లు రాక పనులు నిలిచిపోయాయి. బిల్లు ఇప్పించి ఆదుకోండి. – పడకంటి సిరిచందన, గోపాల్‌రావుపేట
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి
మాకు రాయికల్ పట్టణంలో 6–43 నంబర్ గల ఇంటికి సంబంధించి 3.50 గుంటల స్థలం ఉంది. మా నాన్న గోపయ్య ద్వారా సంక్రమించిన ఆ స్థలానికి మేం ముగ్గురం వారసులం. రెండో సోదరుడు పోచయ్య ఆ స్థలం మొత్తాన్ని మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నడు. అందులో ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తున్నడు. ఎలాంటి పంపకాలు జరగని ఉమ్మడి ఆస్తికి రిజిస్ట్రేషన్ రద్దు చేసి మాకు న్యాయం చేయండి.
– పాలెపు బాబయ్య, రాయికల్
బిల్లు రాక ఇల్లు ఆగింది


