మెట్‌పల్లి: ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని మెట్‌పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్‌రావు అన్నారు. పట్టణంలోని మెప్మా కార్యాలయంలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడారు. రుణాలతో మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. తద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశముంటుందన్నారు. అంతకుముందు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, కమిషనర్ మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి తదితరులున్నారు.
గోదావరి మహాహారతి స్థల పరిశీలన
ధర్మపురి: ధర్మపురిలోని గోదావరి తీరంలో నవంబర్ 9న నిర్వహించే గోదావరి మహాహారతి కార్యక్రమం కోసం శనివారం సాయంత్రం స్థల పరిశీలన చేశారు. గోదావరి హారతి రాష్ట్ర కో–కన్వీనర్ రామ్‌సుధాకర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమంలో చేపట్టే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులున్నారు.
అరటిసాగుపై రైతులకు అవగాహన
మేడిపల్లి: అరటి సాగుపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మండలంలోని కట్లకుంటలో రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికా టరి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ రైతులు వరి, పత్తి వంటి పంటలతోపాటు ఆదాయం ఇచ్చే అరటిని సాగు చేయాలని సూచించారు. అరటితో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.28 వేల సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 1500 ఎకరాల్లో అరటి సాగు ఉండేదని, ప్రస్తుతం 24 ఎకరా లకు పడిపోయిందని తెలిపారు. మార్కెట్‌లో అరటిపండ్లకు డిమాండ్ ఉందని, ఢిల్లీ నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడానికి సి ద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏవో షాహిద్ అలీ, ఏఈవో రాధ, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
బంద్ సక్సెస్‌తో ‘రిజర్వేషన్’కు ప్రాధాన్యం
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చిన బంద్ విజయవంతం కావడంతో ప్రక్రియ అమలుకు ప్రాధాన్యత ఏర్పడినట్లయ్యిందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని చర్యలూ తీసుకుందని తెలిపారు. అయినా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. రిజర్వేషన్ అమలు రాజకీయ పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. 42శాతం రిజర్వేషన్ పొందడం, బలహీనవర్గాల ప్రజల హక్కు అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతోపాటు, విద్య, ఉద్యోగాల్లో ప్రధానమైందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నందయ్య, బండ శంకర్, మోహన్, జగదీశ్వర్ పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి