
బంద్ విజయవంతం
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఐక్యవేదిక ఇచ్చిన బంద్ పిలుపు జిల్లాలో విజయవంతమైంది. బంద్‌కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఉదయం నుంచే బీసీ సంఘాల ఆధ్వర్యంలో తిరుగుతూ దుకాణాలను మూసివేయించారు. కొందరు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. పెట్రోల్‌బంక్‌లు మూసివేశారు. పాఠశాలలు సెలవు ప్రకటించాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొన్ని దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు తెరుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పోలీసుల బందోబస్తు
జగిత్యాలక్రైం: అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్‌డిపో, బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో పహరా కాశారు.
గొల్లపల్లిలో ఆందోళన చేస్తున్న బీసీ సంఘాల నాయకులు
జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు

బంద్ విజయవంతం