
42శాతం రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉంది
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: 42 శాతం రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్‌పై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, బాల ముకుందం, అడువాల లక్ష్మణ్, శ్రీనివాస్, రవీందర్‌రావు పాల్గొన్నారు.
క్రీడాపోటీల్లో పాల్గొనండి
క్రీడాపోటీల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం మాస్టర్ మైండ్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్–17 స్టేట్ లెవల్ చెస్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చెస్ పోటీల్లో పాల్గొంటే మెదడు చురుకుగా ఉంటుందన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 19న గంగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో టోర్నమెంట్ జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు 78159 74976 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు
ధర్మపురి: ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కళాశాల లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కళాశాల ఏర్పాటుతో మేలు జరగనుంది. సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవతో కళాశాల మంజూరు చేస్తూ.. ఎడ్యుకేషన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో లక్ష్మణ్‌కుమార్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లయ్యింది.