
రాజన్న ఆలయంలో రేపు దీపావళి వేడుకలు
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 20న దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి శనివారం తెలిపారు. ఉదయాత్పూర్వం 3.30 గంటలకు మంగళవాయిద్యాలు, 4.40 గంటలకు దీపావళి హారతి తర్వాత అభ్యంగన స్నానం, 5 గంటలకు ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతఃకాల పూజ, సాయంత్రం 4 గంటలకు నరకాసురవధ, రాత్రి 6.30 గంటలకు ధనలక్ష్మిపూజ అనంతరం సేవ ఉంటుందని వివరించారు.
22 నుంచి కార్తీకమాసం షురూ
ఈనెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీకమాసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. ప్రతీ సోమవారం, ఏకాదశి రోజున సత్యనారాయణస్వామికి వ్రతాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 2న కార్తీకశుద్ధ ద్వాదశి ఉదయం 6.30 గంటలకు రుక్మిణీవిఠళేశ్వరస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు, సాయంత్రం 6.35 గంటలకు శ్రీకృష్ణతులసీ కల్యాణం, 4న వైకుంఠ చతుర్దశి సందర్భంగా అనంతపద్మనాభస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు, సుబ్రమణ్యస్వామికి మహాపూజ, పొన్నచెట్టు సేవ నిర్వహిస్తామన్నారు. 5న కార్తీకపౌర్ణమి సందర్భంగా రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, శ్రీస్వామి వారికి మహాపూజ నిర్వహించనున్నట్లు వివరించారు.