
మద్యం షాపులకు1750 టెండర్లు
జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకుగాను 1750 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శనివారం బీసీల బంద్ కొనసాగినా.. దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో 2,636 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలకు ఫీజు పెంచడంతో దరఖాస్తుచేసుకునేందుకు చాలామంది కొంత వెనుకడుగు వేశారు.
ఈనెల 23న డ్రా పద్ధతిన లబ్ధిదారుల ఎంపిక
మద్యం షాపులకు టెండర్లు వేసిన వారిని ఈనెల 23న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో డ్రా పద్ధతిన నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఎకై ్సజ్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫొటోతో కూడిన పాస్‌లు అందించారు. పాస్‌లు ఉన్నవారినే లోనికి అనుమతివ్వనున్నారు.