
రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని 48వార్డులోని టీఆర్‌నగర్‌కాలనీకి వెళ్లే దారి. ఎక్కడ చూసినా బురదే. ఎక్కడ జారి పడతామోనని కాలనీవాసులు భయపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. మొన్నటివరకు ఇది గ్రామపంచాయతీగా ఉండేది. మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటినుంచి అక్కడి ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించి కాలనీ రోడ్డును బాగుచేయించాలని కోరుతున్నారు.
– జగిత్యాల

రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?