
సృజనాత్మకత.. సమస్యల పరిష్కారం
వికసిత్ భారత్ బిల్డథాన్–2025 లక్ష్యం ఈనెల 13లోపు నమోదుకు అవకాశం ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు అర్హులు
జగిత్యాల: అన్ని విద్యాసంస్థల్లో ఆరో తరగతి నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత.. సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకునేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వికసిత్ భారత్ బిల్డథాన్–2025ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు మూడు నుంచి ఏడు సమూహాలు చేసి వికసిత్ భారత్ బిల్డథాన్ పోర్టల్‌లో ఈనెల 13లోపు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
వికసిత్ భారత్ బిల్డథాన్ థీమ్
● ఆత్మనిర్భర్ భారత్: స్వావలంభన వ్యవస్థలు, సాధనాలు, పరిష్కారాలు నిర్మించడం
● స్వదేశీ : ఆలోచనలు జ్ఞాన వ్యవస్థలు, ఆవిష్కరణలు పెంపొందించుకోవడం
● స్థానికులకు స్వరం : స్థానిక ఉత్పత్తులు, వనరులను ప్రోత్సహించడం
● సమృద్ధ భారత్ : శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధికి మార్గాలను సృష్టించడం
ఉపాధ్యాయుల పాత్ర
● విద్యార్థి బృందాలకు మార్గదర్శకత్వం
● ఆలోచన, సమస్యల పరిష్కారం, నమూనా, అభివృద్ధిపై మార్గదర్శకత్వం అందించడం
● రిజిస్ట్రేషన్ చేయించడంలో సహాయం చేయడం
● సమర్పణ, ఆలోచన, నమూనా ప్రక్రియలో విద్యార్థులకు సహాయం చేయడం
● థీమ్‌లను వివరించడం
● విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లను నాలుగు ప్రధాన థీమ్‌లతో అర్థం చేసుకున్నారని, సమలేఖనం చేసుకున్నారని నిర్ధారించుకోవడం, స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ, సమృద్ధి భారత్ జట్టును ప్రోత్సహించడం
విద్యార్థుల పాత్ర
● సృజనాత్మకత ఆలోచనలకు వాస్తవ సమస్యలకు పరిష్కారాలు అభివృద్ధి చేయడం.
● విద్యార్థుల ఆలోచనల భౌతిక, డిజిటల్ నమూనా రూపొందించడం, కలిసి పనిచేయడం,
● బృందంగా ఏర్పడిన విద్యార్థులు ప్రాజెక్ట్ ఆలోచన, నమూనా ప్రదర్శించే చిన్న వీడియోను (2 నిమిషాల కంటే తక్కువ)ను తయారుచేసి పోర్టల్‌లో సమర్పించడం.
ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయుల పాత్ర
● వికసిత్ భారత్‌లో విద్యార్థులు పాల్గొనేంలా ప్రోత్సహించాలి
● రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించి గడువులోపు అన్ని జట్లు అధికారికంగా పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయో లేదో నిర్ధారించుకోవాలి.
● మౌలిక సదుపాయాలు అందించాలి.
● విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించాలి. (ప్రయోగశాల, తరగతి గది)
● విద్యార్థులను తమ తుది ఎంట్రీలను అప్‌లోడ్ చేయడంలో మార్గదిర్దేశం చేయాలి.
● పాఠశాలలో నాలుగు క్లబ్‌లను ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించడం, వర్క్‌షాపులను నిర్వహిస్తూ వాటిని అన్నింటి గురించి వివరించాలి.
● క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌ను ప్రదరించాలి.
● మరిన్ని వివరాలకు 94402 12333 సంప్రదించాలి.