పేదలకు నాణ్యమైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు నాణ్యమైన వైద్యం

Oct 12 2025 6:39 AM | Updated on Oct 12 2025 6:39 AM

పేదలక

పేదలకు నాణ్యమైన వైద్యం

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. టీఆర్‌నగర్‌లో రూ.40 కోట్లతో ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చల్‌గల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, త్వరలోనే రూ.20 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభం కానుందన్నారు. రూ.203కోట్లతో జగిత్యాలకు నూతన ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, అడువాల లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

కోతులను నివారించండి

జగిత్యాలటౌన్‌: రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, స్టెరిలైజేషన్‌ ద్వారా వాటి పునరుత్పత్త అరికట్టాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరారు. కోతులను నివారించకుంటే వ్యవసాయం ప్రమాదంలో పడుతుందన్నారు. జిల్లాకో స్టెరిలైజేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రధాని, సీఎంలకు లేఖ రాశారు. కోతుల సమస్య తీవ్రతను గుర్తించిన హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి.. వాటి పునరుత్పత్తిని గణనీయంగా తగ్గించగలిగిందని, రాష్ట్రంలో కూడా అలాంటి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌కు 50శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలన్నారు. కోతుల బెడద కారణంగా రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనె గింజల సాగు కనుమరుగైందన్నారు.

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

మేడిపల్లి: మండలంలోని కాచారంలో ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ శనివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన బర్ల సాయమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా.. నిర్మాణం పూర్తికావడంతో విప్‌ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుకు కొత్త వస్త్రాలు అందించి గృహప్రవేశం చేయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందని, ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. మండల పరిధిలో మొదట ఇల్లు పూర్తయిన లబ్ధిదారుకు రూ.50వేలు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన మాజీ సర్పంచ్‌ రాజాగౌడ్‌ మాట నిలుపుకొన్నారు. సాయమ్మకు విప్‌ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదం వినోద్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌ రెడ్డి, చేపూరి నాగరాజు, శ్రీపతి దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

మెట్‌పల్లి: విద్యార్థులు చదువుల్లో రాణిస్తే ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుందని మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌ మేజిస్ట్రేట్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని ఆరపేట బాలికల గురుకులంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించడానికి కృషి చేయాలన్నారు. అవరోధాలు ఎన్ని ఎదురైనప్పటికీ కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. అనంతరం బాలికలకు పోక్సోతోపాటు పలు చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సై కిరణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కంతి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

పేదలకు నాణ్యమైన వైద్యం1
1/3

పేదలకు నాణ్యమైన వైద్యం

పేదలకు నాణ్యమైన వైద్యం2
2/3

పేదలకు నాణ్యమైన వైద్యం

పేదలకు నాణ్యమైన వైద్యం3
3/3

పేదలకు నాణ్యమైన వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement