
ఎన్నికల వరకే రాజకీయం
రాయికల్: రాజకీయాలు ఎన్నికల వరకేనని, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకే సీఎంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్‌లోని 35 మంది లబ్ధిదారులకు రూ. 8.50లక్షల చెక్కులు అందించారు. మున్సిపల్ పార్కు పనులపై సమీక్షించారు. రాయికల్ అభివృద్దికి నిరంతరం పనిచేస్తున్నానన్నారు. సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, బల్దియా కమిషనర్ మనోహర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, నాయకులు పడిగెల రవీందర్ రెడ్డి, గన్నె రాజరెడ్డి, రవీందర్‌రావు, కోల శ్రీనివాస్, అచ్యుత్‌రావు, సుదర్శన్ పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దుకు కృషి
జగిత్యాలటౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలయ్యేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పీఆర్టీయూ నాయకులకు హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీం వర్తించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ టెట్‌పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలవారీగా రూ.700కోట్లు విడుదలకు ఒత్తిడి తెస్తామన్నారు. వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని కోరారు. ఇటీవల పదోన్నతి పొందిన 153మంది ఉపాధ్యాయులను సన్మానించారు.