
బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
జగిత్యాలరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ కపట ప్రేమ ప్రదర్శిస్తోందని జెడీప మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీలను పావుగా వాడుకుంటోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు చేసింది శూన్యమన్నారు. గవర్నర్ వద్ద.. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నా.. జీవో9తో ఎన్నికలకు ఎలా వెళ్తారో సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ర్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరావు, మాజీ సర్పంచ్ ప్రవీణ్‌గౌడ్, నాయకులు శేఖర్, మహేశ్ గౌడ్, రాకేశ్, వెంకటేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.