
ఎవరూ పట్టించుకుంట లేరు
ఇప్పపెల్లిలో నల్లా నీరు సరఫరా అయ్యే పైపులైన్ సరిగా లేదు. మరమ్మతు చేయించాలని చెప్పినా ఏళ్లుగా ఎవ రూ పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామంలోని పలు వా డలకు నల్లానీరు రావడంలేదు. వాడల్లోని బోరుబావులతో ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నాం. తాగేందుకు మినరల్‌వాటర్ కొనుక్కుంటున్నం.
– సంబ నవీన్, ఇప్పపెల్లి
గ్రామాల్లో ట్యాంకులు ఉన్నా.. పైప్‌లైన్ లీకేజీ అవుతున్నాయి. మరమ్మతు చేయించకపోవడంతో నల్లా నీరు కలుషితం అవుతోంది. వాటర్ ప్లాంట్ నుంచి రూ.5చెల్లించి 20 లీటర్ల నీరు కొనుక్కుని తాగుతున్నాం. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు.
– తుమ్మనపెల్లి మహేశ్, భూషణరావుపేట
గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాల్సిన బాధ్యత ఆయా గ్రామాల కార్యదర్శులదే. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో తాగునీటి సరఫరాను పర్యవేక్షించేలా చూస్తాం.
– ఆనంద్,
ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ

ఎవరూ పట్టించుకుంట లేరు