
దళితులంటే అందరికీ చులకనే..
● ఏ స్థాయిలో ఉన్నా వివక్ష తప్పడం లేదు ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల: సమాజంలో దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగి నా అందరికీ చులకనగానే ఉంద ని, వివక్ష తప్పడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. అంబేడ్కర్ నుంచి ఇప్పటివరకు దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. కుల వివక్ష అంతానికి ఆర్థిక, సామాజిక సమానత్వం అవసరముందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్‌రామకృష్ణ గవాయ్‌పై జరిగిన దాడి.. దళిత మంత్రి అడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు జాతికే అవమానం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, దాడులపై వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ ఉద్యోగులు నిబద్దతతో పనిచేయాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విద్యుత్ సిబ్బందితో సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్‌సేవల్లో ఆగస్టులో జిల్లా ముందువరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

దళితులంటే అందరికీ చులకనే..