
జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలి
జగిత్యాల: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్‌ను ఆదేశించారు. కలెక్టర్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చిందని, కొన్నిచోట్ల ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారితో నేరుగా మాట్లాడిన ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఎస్సారెస్పీ 40 గేట్ల ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో 40 గేట్లు ఎత్తి 2,38,720 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.
టెండర్లు ఆహ్వానం
జగిత్యాల: జిల్లాలోని 123 జెడ్పీ, ప్రాథమికోన్నత, మోడల్‌స్కూల్, కేజీబీవీల్లో కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మరమ్మతు చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. ఆసక్తి గల వారు కంప్యూటర్ హార్డ్‌వేర్, సేల్స్ అండ్ సర్వీసెస్ నుంచి సీల్డ్ టెండర్లను ఈనెల 25న సాయంత్రం 5 గంటలలోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు విద్యాశాఖ కార్యాలయం కో–ఆర్డినేటర్ 95150 60246 సంప్రదించాలని కోరారు.
విద్యార్థి చదువు ప్రగతికి వెలుగు
కొడిమ్యాల: విద్యార్థులు బాగా చదువుకుంటే అన్నిరంగాల్లో రాణించగలుగుతారని ఇంటర్మీ డియట్ జిల్లా అధికారి బి.నారాయణ అన్నా రు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను సోమవారం తనిఖీ చేశారు. ఆధుని క మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు బోధన పద్ధతులు మెరుగుపరుచుకోవాలన్నా రు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాల కు రావాలని, క్రమశిక్షణ, పట్టుదలతో చదవా లని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ వేణు, అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సహస్ర లింగాల ఆలయంలో పూజలు
జగిత్యాలరూరల్: దుర్గ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొ లాసలోని సహస్ర లింగాల దేవాలయంలో భక్తులు పూజలు చేశారు. అన్నపూజలో పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు నలమాసు గంగాధర్ పాల్గొన్నారు.
ఆలయానికి సింహ వాహనం అందజేత
ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహోత్సవాలకు దేవాలయ కమిటీ మాజీ అధ్యక్షుడు పట్నం నర్సయ్య కుమారుడు పట్నం నరేశ్ అనూజ దంపతులు సోమవారం సింహవాహానాన్ని అందచేశారు.కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసచార్యులు, మలేపు రమేష్, కరం ఇంద్రయ్య పాల్గొన్నారు.

జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలి

జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలి

జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలి