
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రై ం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గ్రీవెన్స్‌లో భాగంగా వివిధ ప్రాంతాల 12 మంది దరఖాస్తులు సమర్పించారు. వారితో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎస్సారెస్పీకి 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో 39 గేట్లను ఎత్తి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, సరస్వతి కెనాల్‌కు 400, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
మాజీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ సస్పెండ్
జగిత్యాల: జగిత్యాల రూరల్ మండల మాజీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరగా.. తనను ఎవరు రమ్మన్నారంటూ అవమానించి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, కుట్రతో ఇలా చేశారని, కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ చించినందుకు తనపై కక్షగట్టారని తెలిపారు.
సేవకులకు వేతనాలు పెంపు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ఏళ్ల తరబడి వివిధ రకాల సేవలందిస్తున్న తాత్కాలిక సేవకులకు (బోయలు) వేతనాలు పెంచుతూ సోమవారం జీవో జారీ అయింది. ఆలయంలో పనిచేసే 12 మంది తాత్కాలిక సేవకులకు ప్రస్తుతం రూ.14వేల వేతనం వస్తుండగా.. దానిని రూ.17,500 వరకు పెంచుతున్నట్లు జీవో జారీ అయ్యింది. జీవో పత్రాలను మంత్రి అడ్లూరి చేతులమీదుగా పంపిణీ చేశారు.

బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు