
పక్షవాత బాధిత కుటుంబానికి రూ.1.23 లక్షలు
ధర్మపురి: ఒక వైపు పేదరికం.. మరోవైపు పక్షవా తం రావడంతో ఓ నిరుపేద ఇంటికే పరిమితమయ్యాడు. ఆ బాధితుడిని ఆదుకునేందుకు ఫేస్‌బుక్ మిత్రులు రూ.1.23 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ధర్మపురికి చెందిన సంకు రాజశేఖర్ బీడీ కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండేళ్ల క్రితం అప్పు చేసి కూతు రు వివాహం చేశాడు. ఏడు నెలల క్రితం పక్షవాతం బారిన పడడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి అద్దె, కుటుంబ ఖర్చులు భారంగా మారడంతో వైద్యానికి దూరమయ్యాడు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకు డు రేణికుంట రమేశ్ ఈనెల 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బాధితుడికి సాయం అందించాలని కోరారు. స్పందించిన ఎన్నారైల మిత్రులు రాజశేఖర్ భార్య భూలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.1.23 లక్షలు విరాళాలుగా పంపించారు. ప్రస్తుత వైద్యం, ఇతర ఖర్చుల కోసం రూ.23వేలను స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ దిలీప్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. మిగిలిన డబ్బులను భూలక్ష్మి బ్యాంకు ఖాతాలో జమ చేశామని రమేశ్ తెలిపారు.

పక్షవాత బాధిత కుటుంబానికి రూ.1.23 లక్షలు