
ఒక్కేసి పువ్వేసి చందమామ..
జగిత్యాలటౌన్/జగిత్యాలరూరల్/కోరుట్ల/సారంగాపూర్/
పెగడపల్లి/మల్యాల:ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. ఉదయమే లేచి రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి సాయంత్రం కూడళ్లలో ఆడుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జిల్లాకేంద్రంలోని ధరూర్ క్యాంపు రామాలయం, మోతె చెరువు, చింతకుంట చెరువు, కండ్లపల్లి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మా.. మళ్లీ రావమ్మా.. అంటూ వీడ్కోలు పలికారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ..