గరత్మంతుని వాహనంపై లక్ష్మీనృసింహుడు
మల్యాల: దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సరస్వతీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామచంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
ధర్మపురి: శరన్నవరాత్రోత్సోవాల సందర్భంగా సోమవారం సాయంత్రం యోగ, ఉగ్ర శ్రీలక్ష్మీనృసింహస్వాములను గరత్మంతుని వాహనంపై ఊరేగించారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
మహాగౌరిగా అమ్మవారు
ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సోమవారం మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో 8వ రోజు చండీపారాయణం, దేవి భాగవత పారాయణం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు హాజరయ్యారు.
సరస్వతీమాతగా అమ్మవారు
సరస్వతీమాతగా అమ్మవారు
సరస్వతీమాతగా అమ్మవారు